ప్రత్యేక హోదా వచ్చే వరకూ ప్రయత్నిస్తాం.. చంద్రబాబు
posted on Aug 1, 2015 6:15PM

దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంతో ఏపీ రాష్ట్రానికి బాంబు పేల్చినంత పైనంది. ఎప్పటినుండో ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్న ఏపీ రాష్ట్రానికి కేంద్రం చెప్పిన మాటతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈవిషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందని.. అందుకే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నామని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాష్ట్రాలతో ఏపీని పోల్చవద్దని.. ఏపీది ప్రత్యేక పరిస్థితి అని.. ఏపీకీ ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల ఆర్ధిక లోటు చాలా ఉందని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వననడం సబబు కాదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాలతో పోటీపడే స్థాయికి వచ్చేవరకు కేంద్రం సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.