లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు
posted on Jul 19, 2025 7:39PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 300 పేజీలకుపైగా ఉన్న ప్రాధమిక ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు. ఆ పత్రాలను ట్రంకు పెట్టెలో తీసుకెళ్లారు. మరో 20 రోజుల్లో రెండవ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ వారిని పలు దఫాలు విచారించింది.11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేసి కోర్టుకు సమర్పించారు.
మొత్తంగా రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ పేర్కొంది. ఛార్జ్‌షీట్‌లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రపై సిట్ అధికారులు పేర్కొనలేదు. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సిట్ పేర్కొంది. మద్యం పాలసీ మొదలు, బ్రాండ్‌ల తయారీ, డబ్బు తరలింపు వాటిని చేరవేసిన డెన్‌లు, తదితర వివరాలు అన్నీ ఛార్జీషీట్‌లో పేర్కొంది. మొత్తం 26ె8 మంది సాక్షులను విచారించి సేకరించిన సమాచారం 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు అందులో పేర్కొంది.
షెల్ కంపెనీల ద్వారా డబ్బుని తరలించి, బ్లాక్ మనీనీ వైట్‌గా మార్చిన వైనాన్ని రియల్ ఎస్టేట్, బ్యాంకులు బంగారు దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు వివరాలను ఛార్జీషీట్‌లో పేర్కొంది. సాంకేతికంగా సమాచారం దొరకకుండా ధ్వంసం చేసిన ఫోన్‌లలోని సమాచారన్ని కుడా సేకరించినట్లు సిట్ బృందాన్నికి సేకరించినట్లు తెలుస్తోంది.ఈ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.