నేడు అనురాధ, మోహన్ ల అంత్యక్రియలు

చిత్తూరు జిల్లా మేయర్ అనురాధ అమె భర్త మోహన్ ల అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కటారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అంతేకాదు కటారి దంపతులకు చిత్తూరు వాసులు ఘన నివాళులర్పించారు.. స్వచ్చందంగా బంద్ పాటించారు.

మరోవైపు వీరి హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చింటూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని అనుచరులు మాత్రం లొంగిపోయినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu