మావోయిస్టుల దారుణం.. సర్పంచ్‌ ను కాల్చి చంపారు


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దారుణాలకు అడ్డుకట్టలు లేకుండా అయిపోయింది. ఈసారి మరో దారుణానికి ఒడిగట్టారు మావోలు. కాంకేర్‌ జిల్లా కోరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురాగావ్‌ సర్పంచ్‌ కుమార్‌సింగ్‌ గౌతమ్‌ను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు ఆదివారం రాత్రి దారుణంగా కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu