పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మోర్-మంగళూరు ఎక్స్ ప్రెస్

 

గత రెండు మూడు నెలలుగా వరుసపెట్టి రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు తెల్లవారు జామున సుమారు 2.30-3.00 గంటల సమయంలో తమిళనాడులో కడలూరు జిల్లాలో వృద్దాచలం వద్ద చెన్నై ఎగ్మోర్-మంగళూరు ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మూడు ఏసీ బోగీలు, రెండు స్లీపర్ బోగీలు పట్టాలు తప్పడంతో అందులో ఉన్న ప్రయాణికులలో 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సంగతి తెలియగానే జిల్లా కలెక్టర్, పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu