యోగాసనాలు వేసిన ఏపీ సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ...ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్పవరం యోగా అన్నారు. ఒకప్పుడు మనకు మాత్రమే పరిమితమైన యోగా...మోడీ కృషి వల్ల ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకుందన్నారు. యోగాతో మనసు ప్రశాంతంగా ఉంటుంది..దీంతో ఏదైనా సాధించగలమన్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడిచిపోయింది..దానినే తలచుకుంటూ ఉంటే గనుక ఇంత అభివృద్ధి సాధించగలిగేవారమా అని సీఎం ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu