చంద్రబాబు విదేశ పర్యటన తేదీలు ఇవీ...

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశ పర్యటన షెడ్యూలు ఖరారైంది. నవంబర్ 12, 13, 14న సింగపూర్‌లో, 24, 25, 26 తేదీల్లో జపాన్‌లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా అక్కడి ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. విదేశ పర్యటనకు చంద్రబాబు నాయుడు వెంట రాజధాని సలహా కమిటీ సభ్యుడు, మంత్రి నారాయణ, ఎంపీలు సుజనాచౌదరి, గల్లా జయదేవ్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఉన్నతాధికారులు ఉంటారు. చంద్రబాబు విదేశ పర్యటన మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విదేశీ పెట్టుబడులను, సంస్థలను ఆకర్షించడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు ఈసారి విదేశ పర్యటనలో వీటికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని వుంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం   విదేశాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబుర్లు కూడా తెస్తారన్న అంచనాలు వున్నాయి.