నిఠారి కోలీకి ఉరి శిక్ష కరెక్టే

 

నిఠారి వరుస హత్య కేసులో ప్రథమ ముద్దాయి సురీందర్ కోలీకి ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు స్పష్టంగా చెప్పింది. రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మరణశిక్ష విధించిన కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తొలిసారిగా జరిగిన కోర్టు బహిరంగ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. సురీందర్ కోలీ మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును మళ్లీ సమీక్ష జరపాల్సినంత పొరపాటు ఏదీ జరగలేదని ధర్మాసనం పేర్కొంటూ, కోలీకి ఉరిశిక్షను అమలు చేయవచ్చని చెప్పింది.