ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. నాతో కాదు.. చంద్రబాబు
posted on Nov 9, 2015 3:26PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఉన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను రాయలసీమ వాసినే.. ప్రాణం ఉన్నంత వరకూ సీమకు న్యాయం చేస్తా అని అన్నారు. నాపై వస్తున్న విమర్సలను ఏమాత్రం పట్టించుకోను.. కావాలనే కొంతమంది నేతలు సీమ అభివృద్దికి అడ్డుపడుతున్నారు.. కానీ రాయలసీమను అభివృద్ధి చేసే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడే మకాం వేస్తానని, అవసరమైతే బస్సులో పడుకుని ఇక్కడే తిష్ట వేస్తానని.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గానీ తనతో పెట్టుకోవద్దని..అభివృద్దికి ఎవరైనా అడ్డుపడితే బుల్లెట్‌లా దూసుకెళ్తానని మండిపడ్డారు. సీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తా.. అంతేకాదు రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా అని అన్నారు.