ఎంపీలతో చంద్రబాబు భేటీ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను మరింత వేగిరం చేసినట్టు కనిపిస్తోంది. శనివారం నాడు ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో బిజీగా వున్న ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన బిల్లులోని అంశాలన్నీ నెరవేరేలా కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. తుఫాను నష్టంపై కేంద్రంతో ఎంపీలందరూ మాట్లాడాలని, రాష్ట్రానికి నిధులు తేవడంపై కృషి చేయాలని కోరారు. ఎంపీలందరూ రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్ళాలని ఆదేశించారు. అనంతరం ఎంపీల తరఫున ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ, తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పార్టీ ఎంపీలంతా కోటి రూపాయల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu