మార్ష‌ల్ ఓవరాక్ష‌న్‌.. చంద్ర‌బాబు ఆగ్ర‌హం.. టీడీపీ స‌భ్యుల వాకౌట్‌..

అసెంబ్లీ శాసన సభ ప్రాంగణంలో ఓ మార్షల్ ఓవరాక్షన్ చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి వెళ్తున్న సమయంలో ఓ మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. అది గ‌మ‌నించిన చంద్ర‌బాబు సెక్యూరిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌తో వీడియో రికార్డ్ చేస్తున్న‌ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విష‌యం తెలిసి ఘటనపై చీఫ్ మార్షల్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. మార్షల్ చర్యపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీనే అత‌నితో ఇలా చేయించిందంటూ ఆరోపించింది.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతిపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఆ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ చర్చ అనంతరం యథావిధిగా మళ్లీ సభ్యులు సభకు వచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu