విభజన రాష్ట్ర సమస్య కాదు..దేశ సమస్య: బాబు

 

 

 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం అధికారముందని ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, రాజ్యంగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తెలుగుజాతికి సంబంధించిన సమస్యకాదని, దేశ సమస్య అని బాబు అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటే దేశంలో తీవ్రమైన ప్రభావాలు వుంటాయని హెచ్చరించారు. వ్యక్తులు ముఖ్యం కాదు... వ్యవస్థలు, రాజ్యంగం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu