కాసేపట్లో పార్లమెంటుకు చేరుకోనున్న చంద్రబాబు...

 

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఉదయం  ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలకు ఆయన అల్పాహార విందు ఇచ్చారు. పార్లమెంటులో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి... ఏయే పార్టీల నేతలను కలవాలి? అనే విషయాలపై ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. మరి కాసేపట్లో ఆయన పార్లమెంటుకు చేరుకోనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాలను అన్ని పార్టీల నేతలకు అందజేస్తారు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. అయితే, కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అవుతారా? లేదా? అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu