ఏపీకి రెండు పండుగలు-చంద్రబాబు
posted on Oct 22, 2015 2:18PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ రెండు పండగలు జరుపుకుంటున్నారని...ఒకటి విజయదశమి అయితే రెండోది అమరావతి నగరం శంకుస్థాపన మహోత్సవమని చంద్రబాబునాయుడు అన్నారు, ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టి... ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బృహుత్తరమైన బాధ్యతను తమపై పెట్టారని చంద్రబాబు అన్నారు, తన మాటను నమ్మి... రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, అమరావతికి భూములిచ్చిన రైతాంగాన్ని అభినందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేశామన్న చంద్రబాబు... కులాలు, మతాలకు అతీతంగా మనమట్టి-మన నీరు సేకరించామన్నారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం పుట్టిన గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చి రాజధాని ప్రాంతంలో చల్లామని సీఎం పేర్కొన్నారు.