బాబు పాదయాత్రకు ఆదివారం సెలవు

ఆరోగ్య సమస్యలు, కాలి నొప్పులు పీడిస్తున్నా మొండితనంగా ముందు సాగుతున్న చంద్రబాబు నాయుడు, ఆదివారంనాడు పాదయాత్రకి విరామం ఇచ్చి పూర్తీ విశ్రాంతి తీసుకోవాలని అనుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా, ఆరోగ్యకారణాలతో నాలుగు రోజులు విరామం తీసుకొన్న సంగతి తెలిసిందే. అప్పుడు వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలూ కూడా ఆయనను పాదయాత్ర విరమించమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన కొనసాగించేందుకే నిర్ణయించుకొన్నారు. అయితే, మళ్ళీ ఇంత త్వరగా ఆయన విశ్రాంతి కోరుకోవడం చూస్తే, ఆయన శరీరం సహకరించనప్పటికీ ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికయినా, ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడకపోతే అది ఆయనకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది కనుక బహుశః మళ్ళీ వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలూ ఆయన పాదయత్ర విరమింపజేసే ప్రయత్నం చేయవచ్చును.

 

 

జంటనగరాలుగా గుంటూరు-విజయవాడ

 

చంద్రబాబు తన 129వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం స్థానిక ఎస్ఆర్ఐ వైద్య కళాశాల నుంచి ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర సందర్బంగా ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రెండు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధిచేసి, ఒక ఐటీ హబ్‌ ను ఏర్పాటు చేస్తామని, ఆ రెండు నగరాల చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దానిని నగరంలోని ముఖ్యమయిన అన్ని  ప్రాంతాలతో అనుసంధానం చేస్తామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.