వీఐపీలకు భద్రత తగ్గించి..మహిళలకు రక్షణపెంచండి: సుప్రీం

 

 

 Supreme Court asks Delhi Police to withdraw its personnel from VIP security to make city safer for women

 

 

మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ సిబ్బందిని ఎక్కువగా వినియోగించాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది సిబ్బందిని వీఐపీల భద్రత కొరకు వినియోగిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించి, మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ సిబ్బందిని వినియోగించాలని ఆదేశించింది.


ప్రత్యేకించి డిల్లీలో ప్రముఖులకు ఉన్న అదనపు భద్రత సిబ్బందిని తొలగించి మహిళల భద్రదతకు ఉపయోగించాలని సుప్రింకోర్టు ఆదేశించడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసును దృష్టిలో ఉంచుకుని సుప్రింకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషంగానే కనిపిస్తుంది.


వివిఐపిల భద్రతకు పోలీసు ఆఫీసర్లను వినియోగించే విషయమై ఈ నెల 11వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో రాష్టాల హోం శాఖ కార్యదర్శలు నేరుగా తమ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.