మందాయిపల్లిలో బాదామి చాళుక్య గణేశ శిల్పం

 భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి

హైదరాబాద్ శివారు  శామీర్ పేట మండలం, మందాయిపల్లి శివాలయం దగ్గర రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న గణేష్ శిల్పం బాదామి చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడుకోవడం పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టేరిటీ' కార్యక్రమంలో భాగంగా ఆయన మందాయిపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్న పాత శివాలయం వద్ద ఈ విగ్రహాన్ని గుర్తించారు.

ఒక అడుగు మూడు అంగుళాల ఎత్తు, పది అంగుళాల వెడల్పు, అంతే మందం గల గ్రానైట్ రాతిలో మలచిన గణేష ప్రతిమ, నాలుగు చేతులు, తొండం కలిగి, తలపై చిన్న కిరీటంతో, లలితాసనంలో కూర్చొని, నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడన్నారు. ప్రతిమా లక్షణం, శిల్ప శైలిని అనుసరించి ఈ గణేశ శిల్పం క్రీ.శ. 8వ శతాబ్దికి చెందినదన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని భద్రపరచాలని మందాయపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu