ఏపీ సీఎం జగన్ కు ఝలక్.. కేసీఆర్ కు కేంద్ర మంత్రి ఫోన్ 

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో మాటల యుద్దం సాగుతోంది. తెలంగాణ మంత్రులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు ఏపీ మంత్రులు మాత్రం తాము చర్చలకు సిద్ధమంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కొందరు రాయలసీమ నేతలు టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు. రెండు రాష్ట్రాలు కేంద్ర జలసంఘానికి, కృష్ణా రివర్ బోర్డుకు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఏపీ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయగా. .శ్రీశైలం నుంచి జల విద్యుత్ పేరుతో తెలంగాణ నీటిని దిగువకు విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం క్లంపైంట్ చేసింది. 

రెండు రాష్ట్రాల మధ్య జల  వివాదం సాగుతుండగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి ఝలక్ ఇస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెబుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమంత్రికి కేసీఆర్ మరోసారి వివరించినట్టు సమాచారం. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి  దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం. 

తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పింది సావధానంగా విన్న గజేంద్రసింగ్ షెకావత్.. ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తారని కేసీఆర్‌కు కేంద్రమంత్రి చెప్పారని తెలుస్తోంది. అయితే కేంద్ర జలవనరుల శాఖా మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం చర్చగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతున్న సమయంలో ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంపై ఏపీ ప్రభుత్వం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో మాట్లాడిన షెకావత్... ఏపీ సీఎం జగన్ ను పట్టించుకోకపోవడం ఆసక్తిగా మారింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu