హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మృతి..
posted on Dec 8, 2021 5:16PM
తమిళనాడులో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. బిపిన్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ మరణంతో త్రివిధ దళాలతో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆ హెలికాప్టర్ అత్యంత సురక్షితం.. అయినా, ప్రమాదం?
తమిళనాడులోని ఊటీ సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, మరో ముగ్గురు ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది ప్రయాణించారు. ఇందులో 13 మంది స్పాట్ లోనే చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వారిలో జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్ధర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్‌నాయక్ వివేక్ కుమార్, లాన్స్‌నాయక్ బి. సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.
బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే..
వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్.. కొద్ది గంటలకే ప్రమాదానికి గురయ్యారు. 9 గంటల ప్రాంతంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో డీల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు. ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది.
బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..