ఆక్వారైతుల రుణాలపై మారటోరియం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

 

అమెరికా టారిఫ్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వారైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సహా వాణ్యజ్య, మత్స్య శాఖ మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అమెరికా టారిఫ్ ల కారణంగా ఆక్వారంగానికి పాతిక వేల కోట్ల రూపాయమల నష్టం వాటిల్లిందన్నారు.

దాదాపు 50 శాతం ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు  ఆ లేఖలలో కోరారు. ఆక్వారైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అలాగే ఆక్వారైతుల రుణాలపై మారటోరియం విధించాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu