మీతో మీ చంద్రబాబు.. డయల్ యువర్ సీఎం, మన్ కీ బాత్ లకు అప్ డెటెడ్ వెర్షన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దార్శనికత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పని చేసినా అందులో ముందు చూపు, భవిష్యత్ దర్శనం ఉంటాయి. ఆధునిక సాంకేతికతను ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకుని సత్ఫలితాలు సాధించడం ఆయన ప్రత్యేకత. అయితే ఆయన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి, ప్రయోజనాలను జనాలకు వివరించి చెప్పేందుకు ఇప్పటి వరకూ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు.

ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడం కోసం చంద్రబాబు డయల్ యువర్ సీఎం అనే కార్యక్రమం ద్వారా  1995లోనే  శ్రీకారం చుట్టారు. ఆ ప్రేరణ, స్ఫూర్తితోనే ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారని చెప్పవచ్చు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు మరో సారి ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలను తెలుసుకోవడానిక వినూత్నంగా వారితో ముఖాముఖీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను జోడించి డయల్ యువర్ సీఎం, ప్రధాని మన్ కీ బాత్ ల మేలు కలయికగా, వాటి అప్ డేటెట్ వెర్షన్ గా చంద్రబాబు నేరుగా ప్రజలతో మాట్లేడే విధంగా మీతో మీ చంద్రబాబు అనే కార్యక్రమం రూపొం దుతోంది. అసెంబ్లీ వేదికగా బుధవారం ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సంక్రాంతి నుంచి ఆరంభయమ్యే అవకాశాలున్నాయంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu