అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (మార్చి 28) చెన్నైకు బయలు దరి వెళ్లారు. అక్కడ జరిగే అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిల్ లో ఆయన ప్రసంగిస్తారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై మీనంబాకం ఓల్డ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు చెన్నైలోని తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ఇక మద్రాస్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు చెన్నై పర్యటనకు వెళ్లడం  ఇదే తొలిసారి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu