సింగపూర్ లో సీబీఎన్.. వరుస భేటీలు.. పలు కంపెనీలతో ఎంవోయూలు
posted on Jul 30, 2025 4:54PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ముగిసింది. ఆ ఏపీకి బయలుదేరారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన మొత్తం 26 సమావేశాలలో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన ముగిసి, ఆయన ఏపీకి బయలుదేరి వెడుతున్న సందర్భంగా ఆయన బస చేసిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు చేరుకుని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సింగపూర్ లోని తెలుగు ప్రజల అభిమానానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి తెలుగు ప్రజ తన పట్ల చూపిన అభిమానాలు, ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలూ మరువలేనివని చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ నుంచి చంద్రబాబు బుధవారం (జులై 30) రాత్రి పదిన్నరకు శంషాబాద్ చేరుకుని, అక్కడ నుంచి బెజవాడకు బయలుదేరి రాత్రి పదకొండున్నరకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
చంద్రబాబు సింగపూర్ పర్యటన యావత్తూ ఆయన విజనరీకి తగినట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల రాక లక్ష్యంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిథుల నుంచి ఆయన ప్రజంటేషన్ కు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన తీరుకు ముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో పలు సంస్థలు ఏపీలో కార్యకలాపాలు సాగించేందుకు అంగీకరిస్తూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగపూర్ సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ అయితే చంద్రబాబు పనితీరు, దార్శనికతపై పొగడ్తల వర్షం కురిపించారు. నిరంతరం ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం,
అదే సమయంలో రాష్ట్రప్రగతి, పురోగతి కోసం ప్రణాళికలు రూపొందించి, వాటిని అత్యంత కచ్చిత్వంతో అమలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమౌతుందని ప్రశంసించారు. చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాము ఉత్సు కతతో ఉన్నామంటూ.. గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై కలిసి పని చేయడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెళ్లడించారు. అంతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్‌లో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ అంతే నాణ్యతతో కొనసాగుతుండటానికి కారణం చంద్రబాబు దార్శనికతేనని చెప్పారు.