విశాఖ తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. విశాఖలోని ఎంజీఎం బీచ్‌లో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో నరసింహాచారి వ్యక్తి ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.  

ఈ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. వినూత్న రీతిలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వీఎంఆర్డీని విశాఖ వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.