Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలు.. తెలుగు తమ్ముళ్లలో జోష్!
posted on: Apr 21, 2025 6:48AM
.webp)
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందింది అని కొనియాడారు.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో నటించిన సినిమాలో ‘చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు ప్రశంసలు కురిపిస్తుంటే.. తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థే పొగడ్తల వర్షం కురిపిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ సంబరపడిపోతున్నారు.
తెలంగాణలో తమ రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడినీ విమర్శించి రాజకీలబ్ధి పొందింది బీఆర్ఎస్. తెలంగాణ సెంటిమెంట్ పండించడం కోసం అప్పుడూ, ఇప్పుడూ కూడా చంద్రబాబును తెలంగాణకు విలన్ గా చూపించేందుకు నానా తంటాలూ పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2019 ఎన్నికలలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఎగతాళి చేసిన కేసీఆర్, జగన్ హయాంలో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.
అలాంటి ఆ ఇద్దరూ చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అభినందనలతో ముంచెత్తారు. ఊరికే శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా లేదా రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇదే చంద్రబాబును ఇదే కేసీఆర్, కేటీఆర్ ఇష్టారీతిగా విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు చంద్రబాబును లేదా ఆంధ్రా పాలకులను కేసీఆర్, కేటీఆర్ ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి వారిద్దరూ ఇప్పుడు సీబీఎన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్, కేసీఆర్ లను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.



.webp)


