హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు
posted on Sep 30, 2025 10:14AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (సెప్టెంబర్ 30) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్‌షోలు నిర్వహిస్తూ ఇప్పటికే పారిశ్రామిక వేత్తలను ఏపీకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐటీసీ మౌర్యలో జరిగే ఈ పార్టనర్ షిప్ కర్టెన్ రైజన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
అనంతరం ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ అవుతారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి బుధవారం (అక్టోబర్1)న ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి గజపతి నగరం దత్తి గ్రామం వెడతారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అమరావతి చేరుకుంటారు.