ఓబులాపురం కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు బుధవారం (మే 6) తీర్పు వెలువరించనుంది. దాదాపు 14 ఏళ్ల తరువాత  ఈ కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా అభియోగాలు ఉన్నాయి.  నిబంధనలను తుంగలోకి తొక్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అడ్డగోలుగా, అక్రమ తవ్వకాలు జరిపిందన్న ఆరోపణలపై అప్పటి రోశయ్య సర్కార్ ఓబులాపురం మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తే జీవో జారీ చేసింది.

కాగా ఓఎంసీ పై 2011లో మొదటి చార్జిషీట్ దాఖలైంది.  దాదాపు  .884. కోట్ల ప్రజాధనం లూఠీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో  సీబీఐ కోర్టు 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తీర్పు వెలువరించనుంది.   

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంలో 2009లో సీబీఐ ఒబులాపురం అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేపట్టింది. వైఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్నది అభియోగం. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపల్ సహా తొమ్మండుగురిని సీబీఐ సహ నిందితులుగా పేర్కొంది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు మాజీ ఐఏఎస్ కృపానందం, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ ఆలీఖాన్ లపై కూడా అభియోగాలు నమోదు చేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu