లండన్ లో గాయపడిన సృజనా చౌదరి.. హైదరాబాద్ లో చికిత్స

బీజేపీ సీనియర్‌ నేత, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్ రూంలో జారిపడిగాయపడినట్లు తెలుస్తున్నది.ఈ ఘటనలో ఆయన కుడి చేయి ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు. లండన్ లో ప్రాథమిక చికిత్సఅనంతరం సుజనా చౌదరిని హైదరాబాద్ తరలించి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుడి చేతికి సర్జరీ చేయాల్సి ఉందంటున్నారు.  లండన్ నుంచి ఆయన బుధవారం (మే 6) తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడ నుంచి నేరుగా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  ఇలా ఉండగా లండన్ లోని ఓ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తుండగా జారి పడ్డారని అంటున్నారు

. మొత్తం మీద సుజనా చౌదరి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారనీ, ఆయన కుడి చేయి భుజానికి ఫ్రాక్చర్ అయ్యిందనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుజనా చౌదరి గాయపడటంపై బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు కొద్ది సేపటిలో హెల్త బులెటిన్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu