కడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే...

ఈకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది జీర్ణానికి సంబంధించినదే ఎక్కువ. చాలామంది తమకు తిన్న ఆహారం జీర్ణం కావడం లేదని, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది?? ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య ఏమి కాదు.  మొదటగా కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.


కడుపు ఉబ్బరం రావడానికి గల కారణాలు:- 


మలబద్దకం


సాధారణంగా మలబద్దకం సమస్య ఉన్నవారిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఎక్కువ. మలవిసర్జన అనేది సరిగా జరగకపోతే అది కడుపులో పేగుల మధ్య గట్టిగా మారిపోయి జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం తింటూనే ఉంటే ఒకవైపు మలవిసర్జన కూడా దానికి తగ్గట్టు జరిగిపోతుండాలి. లేకపోతే కడుపులో వాయువులు, వ్యర్థాలు పెరిగి అది ఉబ్బరానికి దారితీస్తుంది.


వేగంగా తినేవారికి


ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఆహారం చాలావరకు పిండి పదార్థంగా మారి జీర్ణశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అయ్యి ఎంతో సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది. కానీ చాలామంది పరిగెత్తాలనే తొందర ఉన్నట్టు వేగంగా తింటారు. దీనివల్ల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు సరైన విధంగా జీర్ణక్రియకు అనువుగా ఉండవు. ఫలితంగా కడుపు ఉబ్బరం చోటుచేసుకుంటుంది.


దంత సమస్యలు ఉన్నవారిలో


దంతాల సమస్యకు కడుపు ఉబ్బరానికి సంబంధం ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. అయితే దంతాల సమస్య ఉన్నవారిలో  రక్తం కారుతూ ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. ఇలా దంతాల వద్ద రక్తం కారడం జరిగినప్పుడు సహజంగా  తినే పదార్థాలతో, తాగే ద్రవాలతో కలసి జీర్ణశయం చేరుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.


ఆహార వేళలు


ఆహారం తీసుకోవడమే కాదు, ఆహార వేళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అస్తవ్యస్తమైన ఆహార వేళలు పాటించడం వల్ల జీర్ణశయం తీరు సరిగా ఉండదు. ఈ కారణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది.


నోటి శుభ్రత


జీర్ణాశయనికి సంబంధించి ఏ సమస్యకు అయినా ఎక్కువ శాతం నోటి శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోరు సరిగా శుభ్రం చేసుకోకుండా తినడం, తాగడం చేస్తే నోటిలో ఏర్పడ్డ బాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. 


పై కారణాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..


ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడంలో ఎలాంటి సమస్యా ఉండదు. 


కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్నప్పుడు గ్లాసుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.


 దంతాల సమస్యలు ఉన్నవారిలో ఆహారం నమలడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేస్తుంటారు. కాబట్టి ఆ సమస్యలకు వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి.


నోటి శుభ్రత లేకుండా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, భోజనం, బేకరీ పదార్థాలు అన్ని కలిపి ఒక్కసారి తీసుకోకూడదు. కొన్ని పదార్థాలు చాలా సులాభంగానూ, మరికొన్ని అలస్యంగానూ జీర్ణమయ్యే వాటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. 


కడుపు ఉబ్బరానికి పైన చెప్పుకున్న జాగ్రత్తసలు పాటించినా సమస్య  తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

                                     ◆నిశ్శబ్ద.