హీల్స్ వేసుకోలేదని అనుమతించలేదు

ఫ్రాన్స్ లో కేన్స్ చలనచిత్రోత్సవం అత్యంత అట్టహాసంగా జరుగుతుందని తెలిసిందే. ఈ రెడ్ కార్పెట్ పై ఎంతోమంది సుందరీమణులు పాల్గొని హొయలొలికిస్తుంటారు. అయితే ఈ కేన్స్ చిత్రోత్సవానికి హీల్స్ వేసుకోలేదని ఓ సినిమా నిర్మాతకు అనుమతి లభించలేదు. వింతగా ఉంది కదా అదెంటో చూద్దాం... వాలేరియా రిక్టర్ అనే హాలివుడ్ నిర్మాత కూడా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొనడానికి వెళ్లింది. అయితే ఆమెది ఒక కాలు కృతిమకాలు కావడంతో హీల్స్ కాకుండా ఫ్లాట్ చెప్పులు వేసుకుంది. దీంతో ఆమెను రెడ్ కార్పెట్ పై నడవడానికి అక్కడివాళ్ళు ఒప్పుకోలేదు. ఆ కారణంగా ఆమె అక్కడినుండి వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు రెడ్ కార్పెటుపై ప్రతి ఒక్క మహిళా కచ్చితంగా ఎత్తు చెప్పులు వేసుకోవాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu