కెనడాలో తెలుగు అమ్మాయిపై కాల్పులు..
posted on May 1, 2016 11:29AM
.jpg)
విదేశాల్లో తెలుగువారిపై దాడులు జరగడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు కెనడాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కెనడాలో ఓ తెలుగు అమ్మాయి పైన గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపి దాడి చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాదుకు చెందిన తింత్రియాజాన్ కెనడాలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఆమె ఓ షాపింగ్ మాల్లో వస్తువులు కొనుగోలు చేస్తుండగా.. ఆ సమయంలో దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్పుల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పోలీసులు చెప్పారు