రేపు మెదక్, నందిగామ ఉప ఎన్నికలు..
posted on Sep 12, 2014 6:33PM
.jpg)
తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నాడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ రాజీనామాతో, నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్‌లో బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్‌రెడ్డి పోటీలో వున్న ప్రధాన అభ్యర్థులు. అలాగే నందిగామలో తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో వుండగా, కాంగ్రెస్ తరఫున బాబూరావు పోటీలో వున్నారు.