బుద్ధవనం శిల్పాలు ఆకట్టుకున్నాయి
posted on Jan 3, 2025 6:26PM
.webp)
విదేశీ బౌద్ధ పరిశోధకులు
బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్ సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.
ఆయన, బుద్ధ వనంలోని వివిధ విభాగాలు, మహాస్తూపం చుట్టూ ఉన్న శిలా శిల్పాలను వారికి చూపించి, వాటి విశిష్ఠతను వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు దమ్మచారి శాసన, డా. రవి చంద్ర, డి. ఆర్. శ్యాంసుందర్ రావు, సిబ్బంది విష్ణు పాల్గొన్నారు.