వైఎస్సార్సీపీ కాదు యువజన శృంగార రసిక చిలిపి పార్టీ.. బుద్ధా అభివర్ణణ

వైఎస్సీర్సీపీని తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా అభివర్ణించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల న్యూడ్ విడియోకాల్ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అయ్యాయి. గోరంట్ల వ్యవహారంలో ఇప్పటికే డిఫెన్స్ లో పడి సైలెంటైపోయిన వైసీసీకి బుద్ధా వెంకన్న తమ పార్టీ పేరును పేరడీ చేస్తూ చేసిన విమర్శలు మరింత తలదించుకునేలా చేశాయి.

ఈ సందర్బంగా గతంలో కూడా ఇటువంటి ఆరోపణలనే ఎదుర్కొన్న నేతలను సైతం వదల లేదు. అవంతి అరగంట సరసం, అంబటి గంట విహారంపై ఆడియోలు బయటపడినప్పుడూ ఏ చర్యలూ తీసుకోలేదనీ, దీంతో గోరంట్ల మాధవ్ ఏకంగా వీడియోనే బయటకు వదిలారని సెటైర్లు వేశారు.

అంబటి ఆడియో లీకైన తరువాత ఆయనకు మంత్రి పదవి లభించిందనీ, ఇప్పుడు గోరంట్లకు జగన్ ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. అసలే గోరంట్ల వీడియోతో తల దించుకుని భరించాల్సిన పరిస్థితిలో ఉన్న వైసీపీ నేతలు బుద్ధా వెంకన్న సెటైర్లకు అవమాన భారంతో తలలు దించుకుంటున్నారు.

ఎవరూ స్పందించడానికి ముందుకు రావడం లేదు. మొత్తం మీద గోరంట్ల వీడియో లీక్ తరువాత వైసీపీలో నోరేసుకు పడిపోయే నేతలందరూ నోళ్లకు తాళం వేసుకున్నారని సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ చేస్తున్నారు.