బిఆర్ఎస్ స్టాండ్ మారింది

డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్  సంసిద్దమైంది.  అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలోని 119 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 

కర్ణాటక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ స్ట్రాటజీ మారింది. ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీతో  పూర్తి వైరంతో ఉన్న కెసీఆర్ ఫలితాల తర్వాత చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ప్రతీరోజు మోడీపై వివర్శనా స్త్రాలు సంధించే బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ మీద అస్ట్రాలను ఎక్కుపెట్టింది. కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలుపొందడమే దీనికి కారణం. కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోవడంతో కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రచారం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీలను ఏకం చేసే కార్యక్రమాలను కేసీఆర్ ప్రస్తుతానికి నిలుపుదల చేశారు. 

పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో బిజెపి, బిఆర్ఎస్ వైరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి  లేదు.  అవసరమైతే పొత్తుల అంశం పరిశీలిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం మిత్ర పార్టీల్లో మజ్లిస్ పార్టీ  మద్దత్తు బిఆర్ఎస్ కు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు క్లారిటీ ఉంది కానీ కేసీఆర్ కి క్లారిటీ లేదు. .  ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నారని వినికిడి.  
2014,2019లో కెసీఆర్ ఒంటరిగానే పోటీ చేశారు. రెండు పర్యాయాలు అధికారంలో వచ్చారు. వరుసగా మూడోసారి అధికారంలో రావాలని చూస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని కెసీఆర్ ఎత్తుగడ. 
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఎలాంటి చొరవ చూపించని కెసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మిత్ర పార్టీలు శత్రు పార్టీలుగా మారకపోవచ్చని కెసీఆర్ నమ్మకం. ఎందుకంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు బిజెపి ప్రధాన శత్రువు. బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోపాయికారి పొత్తు పెట్టుకున్నట్లేనని రాజకీయ  విశ్లేషకులు అంటున్నారు. 
కర్ణాటక ఫలితాల తర్వాత కెసిఆర్ వామపక్షాలతో మిత్రత్వం గూర్చి ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని ఉభయ కమ్యూనినిస్ట్ పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావ్, తమ్మినేని వీరభధ్రం బహిరంగంగానే కెసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మా పార్టీలు బలంగా ఉన్నాయి. ఎక్కువ స్థానాలు గెలుపొందుతాం. ఫలితాల తర్వాత హంగ్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ వస్తే కెసిఆర్ మమ్మల్ని   సంప్రదించొచ్చు అని ఈ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu