తల్లిపాలే చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారం...

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా ఆగష్టు నెలలో  వారం రోజుల పాటు నిర్వహిస్తారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం పిల్లవాదికే కాదు తల్లికీ లభామే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. 21 వ శతాబ్దం లో ఆధునికంగా అభివృద్ది సాధించినా, ఆధునిక యువతులు మాత్రం అమ్మతనానికి దూరమౌతున్నారు. ఆధునిక పోకడలతో తల్లి కాని వారుకొందరైతే తల్లికవడం అదృష్టంగా వరంగా భావించినా ఒక చిత్రంలో తల్లిఅయి ఒక పాపకు జన్మనిచ్చి తల్లిపాలు ఇమ్మని అంటే తాను మిస్ యూనివర్స్,కావాలన్న కల నేరవేరదని పుట్టిన అబిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. స్త్రీకి పుట్టినబిడ్డకు తల్లి స్తన్యం చనుబాలు ఇవ్వడంలో పొందే అనుభూతి వేరుగా ఉంటుంది.అది తల్లి అయినవారికే తెలుస్తుంది.అయితే కొందరు మాత్రం తాము అందంగా ఉండాలంటే తల్లిపాలు ఇవ్వకపోవడం బిడ్డకు అన్యాయం చేసునట్లే అని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ తల్లిపాల దినోత్సవం యొక్క లక్ష్యం తల్లిపాలను ఇవ్వడం ద్వారా వచ్చే లాభాలను తెలిపేందుకే అని తల్లిపాలు కేవలం పిల్లలకే కాదు తల్లికీ లాభమే అన్నది తల్లులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల నిర్వహణ అసలు రహాస్యం మహిళలలో తల్లిపాల ను ప్రోత్చాహించడమే లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం.వచ్చే ఇతర అనారోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.తల్లి పాల వల్ల వచ్చే లాభాల ను అవగాహన కల్పించడం ముఖ్యం. తల్లిపాలలో పిల్ల వాడికి అన్నిరకాల పోషక తత్వాలు అందుతాయని తల్లికి చనుబాలు ఇవ్వడం అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు మంచి లాభాలు కూడా ఉన్నాయి. అన్న విషయాన్ని బాలింతలు తెలుసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకటనలో తల్లిపాలు చిన్న పిల్లలకు సంపూర్ణ ఆహారమని దీనిద్వారా పిల్లల ఆరోగ్యం సంరక్షింప  బడుతుంది.పిల్లల వృద్ధికి అన్నిరకాల పోషకతత్వాలు లభిస్తాయి బాల్యం లో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది సంరక్షిస్తుంది.తల్లిపాలు శిశువుకు ప్రధమ ఆహారంగా ప్రాముఖ్యత కల్పించాలి అన్నిరకాల పోషక తత్వాలు ప్రాధానం చేస్తుంది.ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను మరింత ప్రోత్సహించాలి.

తల్లి పాల సర్వోతమం.

రెండు సంవత్సరాల వయసు వరకు తల్లి పాలు ఇవ్వడం ఉత్తమం.

తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎన్నిలాభాలో...

1)తల్లిపాలు ఇవ్వడం ద్వారా అతిపెద్ద లాభం తల్లి గర్భస్థ సమయం లో పెరిగిన బరువు తగ్గించ వచ్చు.

2)పిల్ల వాడు పుట్టిన సమయం లో తల్లి శరీరం లో చాలా రకాల గాయాలు ఏర్పడతాయి వీటిని పూడ్చే పని తల్లిపాలు సహకరిస్తుంది.

౩)తల్లిపాలు ఆస్టియో ప్రోరొసిస్ ఎముకలు బలహీన పడడం, లేదా కార్డియో వాస్క్యులర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాసం ఉన్నప్పటికీ తగ్గిస్తుంది.

4)తల్లిపాలు ఇచ్చే మహిళలు టైపు2 డయాబెటిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చె ప్రమాదం తగ్గిస్తుంది.

5)తల్లిపాలు మీరు మీ పిల్ల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాన్ని సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.జన్మనిచ్చిన తరువాత వచ్చే ఒత్తిడి నుండి బయట పాడేందుకు సహకరిస్తుంది.

6)తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి వచ్చే హార్మోన్లు నియంత్రణ లో ఉంటాయి.శరీరంలో వచ్చే సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

7) తల్లిపాలు ఇవ్వడం ద్వారా నుద్ర బాగా పడుతుంది చాలా ఘాడమైన నిద్ర వస్తుంది.

అనిరాకాలుగా తల్లి బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. తల్లిపాలలో ఉన్న మమకారానికి వెలకట్టలేము దానిని కొనలేము తల్లిపాలను మించిపోష కాలు మరి ఎందులోనూ ఉండవు. ఈ విషయాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ద్వార్రా తెలిపే ప్రయత్నం చేయడం అభినందనీయం.