వింత శిశువు జననం: కపాలం లేదు

 

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వింత శిశువు జన్మించాడు. ఈ శిశువు కపాలం లేకుండా జన్మించాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం కేజీపూడి గ్రామానికి చెందిన దేవుడమ్మను ప్రసవం కోసం 108 వాహనంలో శృంగవరపు కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తూ వుండగా ఈ వింత మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఈ పసికందు కపాలం లేకుండా మెదడంతా బయటకి వచ్చి కనిపించడంతో అందరూ షాకయ్యారు. తల్లీ బిడ్డను హుటాహుటిగా శృంగవరపు కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరినీ శుక్రవారం నాడే విశాఖలోని కేజీహెచ్‌కి తరలించనున్నామని వైద్యులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu