సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు

పాతబస్తీలోని సిటీ సివిల్  కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వ్యాజ్యాల కోసం వచ్చిన ప్రజలను, న్యాయవాదులను, న్యాయమూర్తులను కోర్టు నుంచి బయటకు పంపేశారు.  

కోర్టు మొత్తాన్నీ ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబు డిఫ్యూసింగ్ స్కాడ్‌తో కోర్టు మొత్తాన్ని జల్లెడ పట్టారు. చివరకు బెదరింపు కాల్ ఫేక్ అని తేల్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఈ బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్నది తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu