జ‌గ‌న్, ప‌వ‌న్.. స్క్రిప్ట్ రైట‌ర్లే తేడా?

ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో  వ్యక్తం అవుతుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్స‌లు పొంత‌న లేకుండా ఎక్క‌డ బ‌డితే అక్క‌డ ఏది ప‌డితే అది మాట్లాడేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో హోరు మంటున్నాయ్. కార‌ణం అందులో మొద‌టిది ప్రాంతీయ‌త‌. ఆయ‌న ఎక్క‌డ పుట్టారో ఎక్క‌డ పెరిగారో ఎక్క‌డ ఎదిగారో అనే దాని మీద ఒక స్థిర‌మైన స‌మాచారం చాలా మందికి తెలీదు. అది అందుబాటులో ఉండ‌దు కూడా. ప‌వ‌న్ కుటుంబానిది పాల‌కొల్లుకు ద‌గ్గ‌ర్లోని మొగ‌ల్తూరు. ఈ ప్రాంతంలో వారికో ఇల్లు కూడా ఉంది. ఇక తండ్రి వెంక‌ట్రావు కొణిదెల ఎక్సైజ్ శాఖ అధికారిగా ప‌లు ప్రాంతాల్లో పని చేశారు.  దీన్ని ఆస‌రాగా తీసుకున్న ప‌వ‌న్.. ప‌లు ప్రాంతాల్లో త‌న రిఫెరెన్సులు జార విడుస్తుంటారు. చీరాల, బాప‌ట్ల‌, ఒంగోలు ఇలా ప‌లు ప్రాంతాల్లో తాను పుట్టాన‌నీ పెరిగాన‌నీ త‌ర్వాత ఆడుకున్నాన‌నీ.. ఇలా  ర‌క‌ర‌కాలుగా చెబుతుంటారాయ‌న‌.

ఆపై నెల్లూరులో ఆయ‌న య‌వ్వ‌నం  సాగిన‌ట్టుగా ప‌దే ప‌దే చెబుతుంటారు. ఇక్క‌డ ఒక కాలేజీలో తాను చ‌దువుకున్న‌ట్టు చెబుతుంటారు. ఆపై తాను ఇంట‌ర్ క‌న్నా మించి చ‌ద‌వ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణం పుస్త‌కాల్లో తాను చ‌దువుకోవ‌ల్సినంత చ‌దువు లేద‌ని అంటారు. నిజానికి   ఇంట‌ర్ క‌న్నా మించి చ‌దవక పోవడాన్ని త‌న‌కు తానే ఒక అవ‌మానంగా భావించి అక్క‌డ‌క్క‌డా ఇలాంటి డ్రాపింగులు చేస్తుంటారు. 

ఇక త‌న‌కు పాల‌నా అనుభ‌వం లేద‌ని ఒక సారి..  తాను త‌లుచుకుంటే బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లై పోతుంద‌ని ఒక సారి.. తాను- స‌ముద్రం- శిఖ‌రం ఒక‌టేన‌నీ.. ఎవ‌రి కాళ్ల ద‌గ్గ‌ర ప‌డి బ‌తికేది లేద‌ని ఒక సారి.. ఆపై త‌న‌క‌న్నా మించిన వారు ఎంద‌రో ఉన్నార‌నీ ఇలా  ర‌క‌ర‌కాలుగా   పొంత‌న లేని మాట‌లు మాట్లాడే స్తుంటారు. ఇదంతా ఆయ‌న‌కు స్క్రిప్ట్ రాసిచ్చే వారి  ప్ర‌భావ‌మా..  లేక త‌నే స్వ‌యంగా ఇలాంటి కామెం ట్లు చేస్తుంటారా? ఒక‌ప్పుడు హిందువుల‌కు వ్య‌తిరేకంగా ఎన్నో కామెంట్లు చేసిన  పవన్ కల్యాణ్..  తాను మురుగ‌న్ దారిలో న‌డిచానని.. చెప్పేసి బుక్ అయిపోతుంటారు. దీంతో ఆయ‌న క్ర‌మంగా త‌న  క్రెడిబిలిటీ కోల్పోతుంటారు. అభిమానులంటే ఎలాగోలా ఆయ‌న జార‌విడిచే ప్ర‌తిదీ అమృత ప్రాయంగా తీసుకుంటారు. కాద‌న‌డం లేదు. కానీ అందరూ అలా ఉండ‌రు క‌దా? ఈ  విష‌యంలో ప‌వ‌న్ ఎందుకో వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పాలి.

అదే చంద్ర‌బాబు త‌న‌కు తాను ఇంత బిజీగా ఉండ‌గా  కూడా ఒక స్ట‌డీ  చేసి త‌ర్వాతే ఏదైనా మాట్లాడ తారు. మొన్న‌టికి మొన్న మ‌హిళా దినోత్స‌వం  రోజు.. రాజ‌కీయేత‌ర ప్ర‌సంగం ఒక‌టి చేశారాయ‌న‌. త‌న ఆహార‌పు అల‌వాట్లు.. ఇత‌ర‌త్రా చ‌ర్చించారు. ఈ క్రమంలో ఆయ‌న మాట‌ల్లో ఒక మెచ్యూరిటీ క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు.. ఎంతో స్ట‌డీ చేసిన ఇన్ఫో క‌నిపిస్తుంది. ఇంత బిజీగా ఉండే చంద్రబాబుకు అంత ప‌రిశీల‌న  ఎలా సాధ్యం అని  ఆయ‌నంటే గిట్ట‌ని వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. 

ఇలాంటి దేదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లోగానీ జ‌గ‌న్ లోగానీ ఉన్న‌ట్టు క‌నిపించ‌దు. జ‌గ‌న్ ఎంత‌టి ఇమ్మెచ్యూర్ అంటే.. ఆయ‌న‌కు పాబ్లో ఎస్కో బార్ అంటే ఎవ‌రో తెలీదు. ప్ర‌త్య‌ర్ధులు త‌న‌ను అత‌డితో పోలిస్తే.. ఎవ‌ర‌ని ఒక అమాయ‌క మొహం పెట్టారు. స‌రే అంద‌రికీ అన్నీ తెలియాల్సిన  ప‌న్లేదు. కానీ కొంతైనా సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక- ప‌రిజ్ఞానం ఉండాలి క‌దా?

ఇదే జ‌గ‌న్ లాంటి వారిచ్చిన‌ట్టు కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు,  డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ వంటి పథకాల  గురించి స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివిన లోకేష్ ఎప్పుడో క‌నుగొన్నారు. కానీ బై బ్యాడ్ ల‌క్.. వాటినే జ‌గ‌న్ కాపీ కొట్టి.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌గా, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ గా మార్చిన‌ట్టు చెబుతారు కొంద‌రు. అదే బాబు అలా క్కాదు.. ప్ర‌స్తుతం పీ4 ఎంత‌టి మ‌హ‌త్త‌ర‌మైన ప‌థ‌క‌మంటే.. అది   పేద‌రికాన్ని పార‌దోలే ఒక  సంజీవ‌నే. అలాంటిదేదీ జ‌గ‌న్ నుంచి ఆశించ‌లేం. ఆయ‌న ఏదైనా స‌రే ఒక పెట్టుబ‌డి  కింద కాకుండా ఖ‌ర్చుగా మార్చుతుంటారు. దీంతో.. రాష్ట్రాన్ని దివాలా తీయించే ధోర‌ణి అవ‌లంబిస్తుంటారు.

బేసిగ్గా  జ‌గ‌న్ చుట్టూ పెద్ద గొప్ప మేథావులెవ‌రూ లేరు. ఒక వేళ ఉన్నా వారెవ‌రూ ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌లో ఉండ‌రు. దానికి తోడు ఆయ‌న‌కు స్క్రిప్ట్ అందించే వారు కూడా ఎంతో అతిశ‌యంగా ఇస్తుంటారు. ఇవ‌న్నీ రివ‌ర్స్ లో విక‌టించిన‌వే త‌ప్ప  ఆయ‌న్ను కాపాడ‌లేక పోయాయి. ప‌వ‌న్ కూడా అంతే ఇద్ద‌రూ ఇద్ద‌రే. వారికెవ‌రు స్క్రిప్ట్ ఇస్తారోగానీ.. వాటిలో ఎంత మాత్రం ఇన్ఫో లేక పోగా.. అతిశ‌యంగా అనిపిస్తాయి. ఇదే ఈ ఇద్ద‌రికీ పెద్ద మైనస్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.