బ్లాక్ ఫంగస్‌తో కళ్ళు పోతాయా ?


కోవిడ్ నుండి  కోలుకున్న దాదాపు 12 మంది రోగులకు బ్లాక్ ఫంగస్ సోకు తోందని కోవిడ్19 పై పోరాడు తున్న వారికి బ్లాక్ ఫంగస్ పెద్ద సవాలుగా మారింది. బ్లాక్ ఫంగస్ సమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని చాలా మంది అపోలోలో చేరారని కొందరు సి హెచ్ ఎల్ లో చేరగా ఇంకొందరు చోఇతా రాం ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇండోర్ జిల్లాలో మ్యుకోర్ మైకోసిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దీనినే బ్లాక్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీని ప్రభావం,ముక్కు, చెవి, మెడకు చేరి నాశనం చేస్తుందని. గత నెలలో అంటే ఏప్రిల్ లో 15 రోజుల క్రితం అంటే సెకండ్ వేవ్ కోరోనా ఇది కనిపించినట్లు నిపుణులు వివరించారు.

ఈ అంశం పై ఎం జి ఎం ఆసుపత్రికి చెందినహెచ్ ఓ డి  ఊపిరి తిత్తుల వ్యాధుల నిపుణుడు డాక్టర్ సలీల్ మాట్లాడుతూ కోవిడ్ 19 కోలుకున్న వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రజలలో పెరుగుతోందని డయాబెటిస్ తో పాటు స్టేరాయిడ్ తీసుకున్న వారిలో ముఖ్యంగా ఐ సి యు లో దీర్ఘ కలం పాటు చికిత్స తీసుకున్న వారిలో ఆక్సిజన్ తెరఫీ తీసుకున్న వారిలో ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపారు. దీనికి కారణం ప్రజలలో వ్యాధి నిరోధాక శక్తి తగ్గడమే అని కోవిడ్19 సమయంలో ఇష్టం వచ్చి నట్లు విచ్చల విడిగా స్తేరాయిడ్స్ తో చికిత్చ చేయడం వల్లే అని బార్ఘవ అభిప్రాయ పడ్డారు. ఇదేసమస్యతో ముంబాయ్ ఆసుపత్రిలో చేరారని. తమకు దగ్గరలో ఉన్న అపోలో, సి హెచ్ .ఎల్  ఆసుపత్రి లో చేరారని వివరించారు.

ముంబై అసుపత్రికి చెందిన డాక్టర్ అనిల్ తపారియా న్యురాలజిస్ట్ మాట్లాడుతూ ప్యండమిక్ కు ముందు 4 గురు లేదా 5గురు రోగులకు బ్లాక్ ఫంగస్ చూసామని. దీనికి కారణం ఇమ్యునిటీ లోపమే అని వీరిలో చాలా మంది కిడ్నీ లేదా క్యాన్సర్, డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్న వారేఅని గత నెల పదిహేను రోజులుగా ముంబాయి ఆసుపత్రిలో 3౦ మంది రోగులకు చికిత్స చేసామని. డాక్టర్  తపారియా తెలిపారు. కాగా బ్లాక్ ఫంగస్ ముక్కునుంచి ప్రారంభ మై చెవిలో చేరి, మెడకు సోకుతుందని దీనిని సకాలంలో గుర్తించక పోతే కన్నుపోయే ప్రమాదం ఉందని తపాడియ వివరించారు. కొన్ని సందర్భాలాలో తీవ్రతను బట్టి కన్ను తొలగించాల్సి వస్తుందని తపాడి యా.విశ్లేషించారు. దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే దీనికి చికిత్చ అత్యంత సులభమని ఫంగస్ రోగుల మెదడులో చేరితే రక్షించడం అసాధ్యమని తేల్చారు. అపోలో ఆసుపత్రి కి చెందిన డాక్టర్ అరవింద్ కింగర్ మాట్లాడుతూ దీనివల్ల దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా 3౦% నుంచి 8౦% ఉంటుందని తెలిపారు. కోవిడ్19 రోగులను  రక్షించేందుకు స్టెరాయిడ్ ను విచ్చల విడిగా వాడడం వల్లే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని అది నెలల నుంచే సంవత్సరం నుంచి డాక్టర్ ఫింగర్ తెలిపారు. దీనికోసం వైద్య చికిత్చ లో ఫెరిఫెరల్ సెంట్రల్ కేతటర్ సరైన పద్దతిలో హైడ్రేషన్, నార్మల్ సెలైన్, అం పోటరి సిస్  బి ఇన్యుజన్-యాంటి ఫంగల్ థెరపిని 
ఆరువరాల పాటు రోసిని రేడియో ఇమేజింగ్  తో రెస్పాన్స్ వ్యాధిని గుర్తించి చికిత్స చేయాలి.