గెల్లు, కౌశిక్ రెడ్డి మండలంలో బీజేపీ హవా..
posted on Nov 2, 2021 1:18PM
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగులో బీజేపీ హవా కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరిచిన ఈటల రాజేందర్... వరుసగా అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన లీడ్ సాధిస్తూ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. మొదటి ఐదు రౌండ్లు హుజురాబాద్ రూరల్ మండలం, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధలో జరిగింది. హుజురాబాద్ రూరల్ మండలంలో స్వల్ప లీడ్ సాధించిన ఈటల.. పట్టణంలో మాత్రం మంచి మెజార్టీ సాధించారు. హుజురాబాద్ మండలం పూర్తయ్యేసరికి 2 వేల 7 వందల లీడ్ సాధించారు.
హుజురాబాద్ తర్వాత వీణవంక మండలం ఓట్లు లెక్కించారు. వీణవంక మండలం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం. అంతేకాదు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి సొంత మండలం కూడా కూడా వీణవంకే. దీంతో వీణవంక మండలంలో తమకు లీడ్ వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది. కాని ఓట్ల లెక్కింపుతో అంతా తారుమారైంది. వీణవంక మండలంలోనూ కమలం జోరు కనిపించింది. వీణవంక మండలానికి సంబంధించిన 6,7 రౌండ్ ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు స్వాంత గ్రామములో షాక్ తగిలింది. హిమ్మత్ నగర్ లో గెల్లుపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 159 ఓట్ల లీడ్ సాధించారు. హిమ్మత్ నగర్ లో శ్రీను కి (358 )ఈటెల రాజేందర్ కి(549) ఓట్లు వచ్చాయి. వీణవంక మండలం మామిడాలపల్లి లో బిజెపికి ఆధిక్యం వచ్చింది. టీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తే మామిడాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి మంత్రి హారీష్ రావు. అయినా మామిడాలపల్లి ప్రజలు ఈటల రాజేందర్ కే జై కొట్టారు.
వీణవంక మండలం మామిడాలపల్లి లో బిజెపికి ఆధిక్యం వచ్చింది. టీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తే మామిడాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి మంత్రి హారీష్ రావు. అయినా మామిడాలపల్లి ప్రజలు ఈటల రాజేందర్ కే జై కొట్టారు.