వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

 

పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌కు హైదరాబాద్‌లోని వైఎస్ జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ను కలిసేందుకు తన సతీమణితో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోటస్‌ పాండ్‌లోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. జగన్‌ను కలిసేందుకు మూడు రోజులుగా సునీల్‌ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయనకు అపాయింట్‌మెంట్ దక్కడం లేదని తెలుస్తోంది. ఈసారి సీటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ను కలిసి మాట్లాడేందుకు సునీల్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జగన్‌ నివాసం వద్దకు వచ్చి రెండు గంటలకు పైగా పడిగాపులు కాసినప్పటికీ అనుమతించలేదు. దీంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు జగన్‌ నివాసం వద్ద వేచిచూస్తున్న సమయంలో వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలికి వెళ్తుండగా ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా జగన్‌ నివాసంలోకి వెళ్లడంతో సునీల్‌ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. సునీల్‌కు ఈ సారి టికెట్ దక్కడం అనుమానమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu