30 వరకూ అనంతపురం జిల్లా జైల్లోనే బోరగడ్డ.. ఎందుకంటే?

బోరుగడ్డ అనిల్   అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని  మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు.  ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం మూడో పట్టణ సీఐను బెదరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బూరగడ్డ అనిల్   ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసినలో రాజమహేందరవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదరించిన కేసులో అరెస్టై బెయిలు పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచీ విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపుం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకువచ్చారు.  ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో అంతవరకూ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలులో రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.  ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్ధించుకుంటూ తాను బెయిలు కోసం ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu