ఔటర్ సర్వీస్ రోడ్డుపై పై రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు బంద్ అయ్యాయి. నార్సంగి నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వైపు వెళ్లో ఓఆర్ఆర్ పై బండరాళ్లు అడ్డంగా పడటంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగానే ఓఆర్ఆర్ పక్కన ఉన్న గుట్టల పై నుంచి బండరాలు దొర్లి పడ్డాయి.

మంచిరేవుల వద్ద ఆ సంఘటన జరిగింది. అదృష్ట వశాత్తు బండరాళ్లు దొర్లిపడిన సంఘటలో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో  పోలీసులు వాహనాలను మళ్లించి రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu