ఈ బ్లాక్ మెయిల్ అంతా...బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌నేనా?

 

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, బీఆర్ నాయుడు మ‌ధ్య వ్య‌వ‌హారం పీక్ స్టేజీకి చేరిపోయిన‌ట్టుంది? ఒకరికొక‌రు టీటీడీ వ్య‌వ‌స్థాగ‌త విమ‌ర్శ‌ల స్థాయిని మ‌ర‌చి వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల వ‌ర‌కూ వ‌చ్చేశారు. అయితే బీఆర్ నాయుడు ఎక్క‌డ భూమ‌న బాగోత‌మంతా తిర‌గ‌దోడుతాడో అన్న భ‌యాందోళ‌న నుంచి ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి తెర‌లేపిన‌ట్టు క‌నిపిస్తోంది.

మేమొచ్చాక మొత్తం ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని చెప్పిన బీఆర్ నాయుడుకు అడుగ‌డుగునా ఆటంకాలు క‌లిగిస్తూనే వ‌స్తున్నారు భూమ‌న‌. అందులో మొద‌టిది గోశాల గోవుల మ‌ర‌ణాల‌ వ్య‌వ‌హారం  కాగా, రెండోది కాస్తంత సీవియ‌ర్ గానే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ముక్కోటి టికెట్ల విష‌యంలో ఏకంగా తోపులాట‌ను సృష్టించి అందులో ఆరుగురు చ‌నిపోయిన‌ట్టుగా చిత్రీక‌రించారు. ఇదంతా టీటీడీ దాని పాల‌క మండ‌లి ఆపై దాని నిర్వాకం మీద పెద్ద ఎత్తున నింద వేశారు.

ఇక ఆల‌యం ముందుకు చెప్పులు వేసుకుని వెళ్లేలా చేసి.. వాటి ద్వారా.. ఒక వివాదం సృష్టించాల‌ని చూశారు. ఆపై ఒక రెడ్డి స‌భ్యుడితో ఆల‌యం ముందు బూతులు తిట్టించి అలాక్కూడా బీఆర్ నాయుడు బ‌ద‌నాం అయ్యేలా చేశారు.

ఇప్పుడు సుధాక‌ర్  రెడ్డిని రెచ్చ‌గొట్టించి.. ఆయ‌న ద్వారా తిరుప‌తికి ఒక మంత్రి కేవ‌లం  రాస‌లీల‌లు చేయ‌డానికే వ‌స్తార‌న్న కామెంట్లు గుప్పించారు. ఇక అక్క‌డితో ఆగ‌క బీఆర్ నాయుడు ఒక బంట్రోతు స్థాయి నుంచి ఒక ట్రావెల్ ఏజెంట్ స్తాయి నుంచి టీవీఫైవ్ అధినేత‌గా ఎలా ఎదిగార‌న్న పాత చ‌రిత్ర‌ను తిర‌గ‌దోడారు. ఆపై కాళేశ్వ‌ర్ బాబా చావు వెన‌క బీఆర్ నాయుడు హ‌స్తం ఉందంటూ గ‌త చ‌రిత్ర త‌వ్వి పోశారు. 

అలాక్కూడా బీఆర్ నాయుడు భ‌య‌ప‌డ్డం లేద‌ని చెప్పి కొత్త‌గా జూబ్లిహిల్స్ ఓపెన్ ల్యాండ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు తీశారు. ఆపై మంచి రేవుల భూముల ఇష్యూ సైతం వెలుగులోకి తెచ్చారు. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి టీటీడీ కేంద్రంగా పెద్ద ఎత్తున అవినీతికి తెర‌లేపిన‌ట్టే ఉంద‌ని అంటున్నారు చాలా మంది.

బీఆర్ కూడా గ‌తంలో చేసిన కామెంట్ల‌ను బ‌ట్టీ చూస్తే ఒక ద‌శ‌లో వీరంతా క‌ల‌సి.. చేసిన నిర్వాకానికి టీటీడీ అప్పుల్లో కూరుకుపోవ‌ల్సి వ‌చ్చేద‌ని తెలుస్తోంది.. అల‌నాడు పురాణ ఇతిహాసాల్లో చెప్పిన‌ట్టు వెంక‌న్న తిరిగి అప్పు తీస్కోవ‌ల్సి వ‌చ్చేద‌ని... అందుకే వెంక‌న్న వీరికెలాగైనా స‌రే బుద్ధి చెప్పాల‌న్న కోణంలో.. 11 సీట్ల పంగ‌నామాల గుణ‌పాఠం చెప్పార‌ని.. అంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu