పీవీకి దేశ అత్యున్నత పురస్కారం

తెలుగుజాతి ఆణిముత్యం, బహుబాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ , హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ప్రకటించినట్టయింది. పీవీకి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

భారత రత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పీ.వీ.నరసింహారావు నిలిచారు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్.కె.అద్వానీలకు భారత రత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మాజీ ప్రధానులు పీ.వీ.నరసింహారావు, చరణ్ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ దఫా మొత్తం ఐదుగురికి భారత రత్న అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu