చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. !

                                        

ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన పోషకం. ఇది శరీరంలో జరిగే అనేక పనులకు  బాధ్యత వహిస్తుంది. కండరాలను నిర్మించడంలో,  మరమ్మత్తు చేయడంలో  ప్రోటీన్ ప్రధాన భాగం. శరీరానికి శక్తిని ఇచ్చేది ప్రోటీనే..  ఎముకలు, చర్మం, గోర్లు,  జుట్టు వంటి   భాగాలను నిర్మించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రొటీన్ లోపం వల్ల శరీరంలో బలహీనత,  అలసట ఏర్పడుతుంది. వెంట్రుకలు రాలడం,  గోళ్లు బలహీనపడడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీని లోపం వల్ల పిల్లల బరువు తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇవి మాత్రమే కాకుండా  అలసట, ఆందోళన,  మానసిక కల్లోలం వంటి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి చాలామంది మాంసం, చేపలు, చికెన్ లేదా గుడ్లు వంటి ఆహారాలు తింటుంటారు. అవే చాలా ఆరోగ్యమని కూడా నమ్ముతారు.  కానీ వాస్తవానికి కొన్ని కూరగాయలు, పప్పులు,  బీన్స్ మొదలైనవి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. చికెన్, మటన్ కాకుండా శాఖాహారులు కూడా తినడానికి అద్భుతమైన ప్రోటీన్ ఆహారంగా ఉలవలను పేర్కొనవచ్చు. వీటినే హార్స్ గ్రామ్ అని కూడా అంటారు.

ఉలవలలో  ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.   ఉలవల నుండి మరింత  పోషకాలను పొందడానికి వీటిని  మొలకెత్తించి తినాలి. ఇలా తింటే ఇవి  జీర్ణం కావడం  కూడా సులభం అవుతుంది. ఉలవలు అర అంగుళం వరకు మొలకెత్తడం మొలకెత్తినప్పుడు వీటిని  తినాలి.

ఉలవలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో పుట్టే అమతమైన వేడిని సమతుల్యం చేయడానికి ఉలవలు తిన్న తరువాత మొలకెత్తించిన పెసలు కూడా తినాలి. అప్పుడ శరీరం వేడికి ఇబ్బంది పడదు.  

ఉలవలలో ఫైబర్,  ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఎంపిక. ఇందులో ఉండే మూలకాలు ఫ్యాట్ బర్నర్స్‌గా పనిచేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

మొలకెత్తిన ఉలవలు తింటే  రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. వీటిలో  లిపిడ్లు, ఫైబర్  రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల మొలకెత్తిన ఉలవలు తింటే  గుండె సిరలలో చిక్కుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతాయి, సిరలలో  అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇక ఉలవల మొలకలు తీసుకోవడం వల్ల అనేక రకాల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.  లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.

                                                    *నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News