నల్ల ఎండుద్రాక్ష తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

 

ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ద్రాక్షలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. వీటిలో గ్రీన్ గ్రేప్స్,  బ్లాక్ గ్రేప్స్ తో పాటు.. ఎర్రగా ఉండే గ్రేప్స్,  చూడ్డానికి నేరేడు పండ్లలాగా పొడవుగా ఉండే గ్రేప్స్ ఇలా రకరకాలు ఉన్నాయి.  అయితే సీజన్ లోనే లభించే ద్రాక్షను ఎప్పుడైనా తినడానకి, ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్ రూపంలో తీసుకుంటారు. వీటిలో ఒకటైన నల్ల ఎండు ద్రాక్ష గురించి చాలామందికి తెలియదు. చాలామంది గ్రీన్ ఎండు ద్రాక్షనే తింటుంటారు. కానీ నల్ల ఎండుద్రాక్ష గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.  ఇంతకీ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

ఎముకల బలం..

నల్ల ఎండు ద్రాక్షలో బోరాన్ ఉంటుంది.  ఇది ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలకు చాలా మంచిది.  ఇది బాగా సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు.

చర్మ వ్యాధులు..

నల్ల ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇవి చర్మ వ్యాధులను,  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

అధిక రక్తపోటు..

నల్ల ఎండుద్రాక్ష తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. వీటిలో ఉండే ఫైబర్,  పొటాషియం,  పాలీ ఫెనాల్స్ రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి.

రక్తహీనత..

సాధారణంగా రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి గ్రీన్ ఎండుద్రాక్ష,  ఖర్జూరం తినమని సలహా ఇస్తుంటారు. వాటితో పాటు నల్ల ఎండుద్రాక్ష కూడా తినవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది.  ఇది రక్తహీనతను తగ్గించడానికి,  శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా నల్ల ఎండుద్రాక్ష తీసుకుంటూ ఉంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా  ఉంటే అది గుండె,  కాలేయం, రక్తనాళాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.  ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది.  అయితే నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్  కు చెక్ పెట్టవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో పాలీ ఫెనాల్స్ అధికంగా ఉంటాయి.  ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇమ్యూనిటీ..

నల్ల ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  శరీర రోగనిరోధక శక్తిని  పెంచడంలో సహాయపడతాయి.

హెయిర్ ఫాల్..

నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది.  హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడేవారు నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.  ఇందులో ఉండే ఐరన్, విటమిన్-సి వంటి లక్షణాలు జుట్టు రాలడాన్నిఆపుతాయి.  అంతేకాదు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, జుట్టు  నల్లగా ఉండటంలోనూ సహాయపడతాయి.

                               *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...