రుషికొండ ప్యాలెస్‌లో బాత్‌టబ్ ఖరీదు 26 లక్షలు!
posted on Jun 16, 2024 8:43PM
ఆ అష్ట దరిద్రుడు జగన్ రుషికొండని తొలిచి పెద్ద పెద్ద నిర్మాణాలు ఎందుకు చేశాడో ఇంతవరకు ఎవరికీ క్లారిటీగా తెలియదు. అది ప్రజల కోసం నిర్మిస్తున్న కట్టడాలు అని వైసీపీ పిశాచాలు చెబుతూ వచ్చాయి. ఇంతవరకు ఆ కట్టడాలను చూసే అవకాశం ఎవరికీ రాలేదు. ఆదివారం నాడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రజలు రిషికొండ కట్టడాలను చూసి ఆశ్చర్యపోయారు. అవి మామూలు కట్టడాలు కాదు.. రాజమహళ్ళు. ఇక్కడ పెట్టిన ఖర్చుకు ఒకే ఒక శాంపిల్ అందరికీ కళ్ళు తిరిగేలా చేస్తుంది. ఈ రాజమహళ్ళలో ఒకచోట ఒక బాత్ టబ్ వుంది. దాని ఖరీదు అక్షరాలా ఇరవై ఆరు లక్షల రూపాయలు. ఒక ప్రభుత్వ భవనంలో ఇంత ఖరీదైన బాత్ టబ్ ఎవరికోసం? ఓర్నీ వైసీపీ పిశాచాల మొహాలు మండ... 26 లక్షల రూపాయల ఖరీదైన బాత్ టబ్ ఏంట్రా?

గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు రుషికొండ భవనాల్లో తిరిగి చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఏ మహారాజు, మహారాణి నివాసం ఉండటానికి, అప్పుడప్పుడు బానిసలతో సమావేశాలు జరుపుకోవడానికి కట్టుకున్నట్టు వున్నాయి తప్ప ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడేలా లేవు. మహారాజు జగన్ తన మహారాణి భారతితో కలసి నివసించడానికే రుషికొండకి గుండు కొట్టి ఈ కట్టడాలు నిర్మించారనే విషయం అర్థమైపోతోంది.

ఆ బిల్డింగులు ఏంటి? వాటిలో సదుపాయాలేంటి? అమ్మో.. ఇది కలయా.. నిజమా? మనం భూలోకంలో వున్నామా, చచ్చి స్వర్గానికి గానీ వచ్చామా అని అక్కడకి వెళ్ళిన వాళ్ళు అందరూ తమను తాము గిల్లుకుని కన్ఫమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కొంచెం ఇంటర్నేషనల్ చరిత్రలోకి వెళ్దాం.. ఫిలిప్పీన్స్ దేశాన్ని మార్కోస్ అనే నియంత చాలాకాలం పరిపాలించాడు. ఆయన గారి భార్య ఇమెల్డా మార్కోస్. మన రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలన ఎలా అంతమైందో, ఫిలిప్పీన్స్.లో కూడా ఓ ఫైన్ మార్నింగ్ మార్కోస్ పాలన అంతమైంది. అప్పటి వరకు మార్కోస్ ప్యాలెస్‌లో ఏముందో బయటివాళ్ళకి ఏమీ తెలియదు. మార్కోస్ పాలన ముగిసిన తర్వాత ఆ ప్యాలెస్‌లోకి వెళ్ళి చూసిన జనానికి కళ్ళు తిరిగిపోయేంత వైభవం కనిపించింది. మార్కోస్ పెళ్ళాం గారు అయిన ఇమెల్డాకి వేల సంఖ్యలో చెప్పులు... వాటిని ఉంచడానికి ఒక భవనం ఉన్నాయంటే మార్కోస్ ఏ రేంజ్‌లో వైభవాన్ని అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన జగన్, అండ్ భారతిలను ఆంధ్రా మార్కోస్ దంపతులుగా జనం అనుకుంటున్నారు.

ఫిలిప్పీన్స్.లో మార్కోస్ మాత్రమే కాదు.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ నియంతృత్వం ముగిసినప్పుడు, లిబియాలో నియంత గడాఫీ శకం అంతమైనప్పుడు కూడా వారి నివాస భవనాలకు వెళ్ళి చూసిన ప్రజలు వామ్మో అని ఆశ్చర్యపోయారు. జనం ఎన్ని కష్టాలు పడుతున్నా, జనం డబ్బుతో వైభవాన్ని అనుభవిస్తూ వచ్చారు ఈ నియంతలు. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ కూడా వాళ్ళకంటే తక్కువ వాడేమీ కాదు అన్నట్టుగా రుషికొండ మీద భవనాలు వున్నాయి.

ప్రజాస్వామిక నియంత జగన్ దుర్మార్గపు పాలన అంతమైపోయింది. అతని పరిపాలనలో జరిగిన ఒక్కో విషయం బయటపడటం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వుంటుందో... ఆంధ్రుడా.. ప్రిపేర్ అయి వుండు!