వార్డు మెంబర్‌గా గెలవని వారు.. ఓట్ల చోరీ అంటున్నారు : బండి సంజయ్
posted on Aug 26, 2025 11:57AM

కాంగ్రెస్ నాయకులది బిచ్చగాళ్ల బతుకు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ముస్లీంల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకుని నమాజ్ చేస్తారు. మేం అలా కాదు. నేను కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా కేవలం హిందూ ఓటు బ్యాంక్ ద్వారనే గెలిచానని గల్లా ఎగిరేసి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటూ తయారు చేస్తామని బండి సంజయ్ తెలిపారు.
ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం. కరీంనగర్‌లో ప్రతి ఓట్లు తీసేయాలి. దొంగ ఓట్లు అంటూ చేసే దుప్ఫ్రచారం ప్రజలను అవమానంచడమేన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శిస్తున్నరని ఆయన అన్నారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. కరీంనగర్‌లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు బీజేపీకీ వస్తాయని ప్రశ్నించారు.